గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. అధికార తెరాస పార్టీ గత ఎన్నికల్లో 99 స్థానాల్లో సత్తా చాటాగా..ఈసారి మాత్రం 55 స్థానాలు సాధించింది. దుబ్బాకలో విజయం తరువాత జోరు మీద ఉన్న భాజపా... గ్రేటర్ పోరులోనూ దూసుకెళ్లింది. గత ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ.. ఈసారి 44 స్థానాల్లో పాగా వేసింది. ఈ ఎన్నికల ఫలితాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెదేపా చనిపోయిందని... కాంగ్రెస్ పార్టీ కొనఊపిరితో ఉందని పేర్కొన్నారు. ఇందులో అధికార తెరాసనూ వదల్లేదు. చావు తప్పి కన్ను లొట్టబోయిన తెరాస అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ రాజకీయాల్లో వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెరాస గ్రేటర్ ఫలితాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి వ్యంగ్యాస్త్రాలు - జీహెచ్ఎంసీ 2020 తాజా వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ఫలితాల్లో అధికార తెరాసకు చావు తప్పి కన్ను లొట్టబోయిందని ఎద్దేవా చేశారు.
ycp-mla-ambati-rambabu
Last Updated : Dec 4, 2020, 7:48 PM IST
TAGGED:
ycp mla ambati rambabu