రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన "ఈ వాచ్" యాప్ పై వైకాపా అభ్యంతరం తెలిపింది. ఎస్ఈసీ విడుదల చేసిన యాప్ బూటకమని , తెదేపా కార్యాలయంలోనే ఆ యాప్ ను తయారు చేశారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.యాప్ ను నమ్మాల్సిన అవసరం లేదని, తెదేపా అభ్యర్థులను గెలిపించడమే యాప్ విడుదల ముఖ్య ఉద్దేశమని ఆక్షేపించారు.
ఎస్ఈసీ మూల్యం చెల్లించక తప్పదు: అంబటి - ఏపీ ఎన్నికల్లో ఈ వాచ్ యాప్
ఎస్ఈసీ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ -వాచ్ యాప్ బూటకమని ఆరోపించారు. తెదేపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించడమే ఆ యాప్ విడుదల ముఖ్య ఉద్దేశమన్నారు.
ఎస్ఈసీ పక్షపాతంతో వ్యహరిస్తున్నారన్న అంబటి...తప్పుమీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారన్నారని మండిపడ్డారు. వచ్చే 2-3 వారాల్లోనే చేసిన తప్పులను ఎస్ఈసీ సరిదిద్దుకోవాలని లేదంటే పదవీ విరమణ తర్వాత కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ గౌరవానికి, హక్కులకు భంగం కల్గిందని మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదుతో శాసనసభ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతుందని.. ఎస్ఈసీ పై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి,శాసనసభకు ఉందన్నారు. ఎస్ఈసీ చేసింది తప్పని తేలితే శిక్ష విధిస్తారన్నారు. అధికారులపై అభిశంసన చేసిన ఎస్ఈసీ.. ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.గొల్లలగూడెంలో హత్య కు గురైన కుటుంబం వద్దకు రాజకీయ నేతలా ఎస్ఈసీ పరామర్శకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.
ఇదీ చదవండి
'ఈ వాచ్' యాప్‌పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యం: నిమ్మగడ్డ