ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగానికి చెందిన వ్యక్తి కాదని రాజకీయ వ్యాపారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. తెదేపా అజెండాలో భాగంగానే ఎస్ఈసీ జిల్లాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. కడపలో నిర్వహించిన సమీక్షలో అసందర్భంగా వ్యవహరించారని అంబటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్లో అధికారిక పర్యటనలు చేస్తున్న ఎస్ఈసీ... రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కడపలో ఎన్నికల సమీక్ష చేసి సీబీఐ కేసుల గురించి ఎందుకు ప్రస్తావించారన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాచించే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ రాజకీయ వ్యాపారి: అంబటి - ap sec latest news
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజ్యాంగానికి చెందిన వ్యక్తి కాదు రాజకీయ వ్యాపారి అంటూ ఆరోపించారు.
ambati rambabu fiers on sec