కాపుల గురించి మాట్లాడే హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తెదేపా హయాంలో కాపులకు జరిగిన అన్యాయంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తుని ఘటనలో కాపులను చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన కాపులందరికీ రుణాలు మంజూరు చేస్తోందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: అంబటి - amabati ramababu comments on kapu reservations
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్న ఆయన.. తుని ఘటనలో కాపులను చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు.
![కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: అంబటి కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: అంబటి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7797469-933-7797469-1593266530136.jpg)
కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: అంబటి