ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు నిరసన హైడ్రామా: అంబటి

ఎన్నికల్లో ఓడిపోవటం వల్లే తెదేపా అధినేత చంద్రబాబు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

ycp mla ambati
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

By

Published : Mar 2, 2021, 3:52 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు రేణిగుంటలో చేసిన నిరసన ఒక హైడ్రామా అని వైకాపా ఆరోపించింది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆక్షేపించారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిశాక అప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం వల్లే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరామని పోలీసులు చెప్తే గర్జిస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేస్తారన్నారు.

ఎన్నికల కోడ్ లేదు, కరోనా లేకపోయినా... 2017 విశాఖ విమానాశ్రయంలో కనీసం లాంజ్​లోకి కూడా జగన్​ను అనుమతించలేదని అంబటి అన్నారు. రన్ వేపై మేము మండుటెండలో కూర్చుని నిరసన తెలిపామన్నారు. ఆ రోజు జగన్ ప్రతిపక్ష నాయకుడే అయినా అనుమతించలేదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన అడ్డుకుంటే అది అప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. పిచ్చి చేష్టలు చేస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చంద్రబాబు అడ్డగింత దుర్మార్గం: తులసీరెడ్డి

ABOUT THE AUTHOR

...view details