పార్టీ బలోపేతంపై వైకాపా అధిష్టానం దృష్టిసారించింది. ఈ మేరకు జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగిస్తూ అధినేత జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవ్వగా... ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల వ్యవహారాలను వై.వి.సుబ్బారెడ్డి చూడనున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వ్యవహరాలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతను కూడా సజ్జల చూడనున్నారు. జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి..ముగ్గురు నేతలకు బాధ్యతలు - విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు
పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైకాపా అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
![పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి..ముగ్గురు నేతలకు బాధ్యతలు ycp leadership focused on strengthening](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7852343-406-7852343-1593615155652.jpg)
ycp leadership focused on strengthening