స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమినషనర్కు వైకాపా నేతలు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. కుప్పం సహా ఇతర చోట్ల ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తీసుకువస్తానని న్యాయస్థానాలను కించపరిచేలా, అగౌరపరిచేలా నారా లోకేశ్ మాట్లాడారని లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
YCP leaders letter to SEC : ఎస్ఈసీకి వైకాపా నేతల లేఖ - YCP leaders wrote a letter to SEC about taking action on TDP leaders
స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీకి వైకాపా నేతలు లేఖ రాశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న తెదేపా నేతలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎస్ఈసీకి వైకాపా నేతల లేఖ