ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా శవరాజకీయాలు చేస్తోంది: హోం మంత్రి సుచరిత - ycp leaders criticized tdp leaders

కోడెల మృతికి ప్రభుత్వమే కారణమన్న తెదేపా నేతల వ్యాఖ్యలను వైకాపా నేతలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని హోం మంత్రి సుచరిత ఆరోపించారు.  కోడెల మృతిని తెదేపా వివాదాస్పదం చెయ్యడం మంచిది కాదని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు  హితవు పలికారు.

కోడెల మృతిపై స్పందించిన మంత్రులు

By

Published : Sep 18, 2019, 4:13 AM IST

కోడెల మృతిపై అనేక అనుమానాలున్నాయని... దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి విషయాలు వెల్లడిస్తామని హోం మంత్రి సుచరిత తెలిపారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

కొోడెల మృతిపై స్పందించిన హోం మంత్రి సుచరిత

మంత్రి మోపిదేవి....

కోడెల శివప్రసాద్ మరణం బాధాకరమని..జిల్లా ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన మృతిని తెదేపా వివాదాస్పదం చెయ్యడం మంచిది కాదని హితవు పలికారు. కోడెల మరణానికి అతని కుమారుడే కారణమని...స్వయానా కోడెల మేనల్లుడు తెలిపారన్నారు. కోడెల కుటుంబానికి వైకాపా తరఫున మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోడెల మృతిపై స్పందించిన మంత్రి మోపిదేవి

ఇదీ చూడండి: ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details