తెదేపా నేతలపై.. వైకాపా నాయకులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో తెదేపా నేతలు తిరుగుతూ.. ప్రజలను ప్రలోభాలు పెట్టడం సహా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసిన.. వైకాపా ప్రదాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కోరారు. క్షేత్ర స్థాయిలో తెదేపా నేతలు చేపడుతున్న పర్యటనలు నిలిపివేసేలా.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెదేపా నేతలపై.. ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు - ycp leaders complaint on tdp leaders latest news
తెదేపా నేతలు ప్రజలను ప్రలోభాలు పెడుతున్నారని... ఎస్ఈసీకి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలు చేపడుతున్న క్షేత్రస్థాయి పర్యటనలు నిలిపివేయాలని నిమ్మగడ్డను కోరారు.
ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు