పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను వైకాపా కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డితో సహా పలువురు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఫిర్యాదు చేసినా.. నామమాత్రపు చర్యలతో సరిపెట్టారని అప్పిరెడ్డి ఆరోపించారు. తెదేపా మేనిఫెస్టో విడుదలను తాము ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినా.. చంద్రబాబుపై కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఏకగ్రీవాలు ఆపాలన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.