ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇసుక కొరత ఉన్నమాట వాస్తవం' - sand issue in ap

తెదేపాను ప్రజలు ఎందుకు తిరస్కరించారో చంద్రబాబు తెలుసుకోవడం లేదని వైకాపా ముఖ్యనేత పార్థసారథి పేర్కొన్నారు. ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

పార్థసారథి

By

Published : Oct 13, 2019, 5:48 PM IST

పార్థసారథి

వైకాపా ప్రభుత్వ పథకాలు చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని వైకాపా సీనియర్ నేత పార్థసారథి పేర్కొన్నారు. కార్యకర్తల భేటీల్లోనూ చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు తెదేపాను ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవడం లేదన్నారు. కృష్ణా, గోదావరిలో వరద వల్ల ఇసుక కొరత ఉన్నమాట వాస్తవమేనన్న పార్థసారథి... సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details