ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుపై దాడి చేసినందుకు ధన్యవాదాలు' - చంద్రబాబు కాన్వాయ్​పై చెప్పులతో దాడి

తమను మోసం చేశారనే ఆవేశంతో...రాజధాని రైతులు చంద్రబాబు కాన్వాయ్​పై దాడిచేసుంటారని మంత్రులు కొనాలి నాని, పేర్ని నాని, సుభాష్ చంద్రబోస్ అన్నారు. అమరావతిని గ్రాఫిక్స్​లో చూపించి రైతులను చంద్రబాబు మోసం చేశారని మంత్రులు ఆక్షేపించారు.

ycp leader counter to chandrababu on slippers attack
'చెప్పులతో దాడి చేసిన రాజధాని వాసులకు మా ధన్యవాదాలు'

By

Published : Nov 29, 2019, 7:58 AM IST

Updated : Nov 29, 2019, 8:10 AM IST

చంద్రబాబు కాన్వాయ్​పై దాడిపై మంత్రుల వ్యాఖ్యలు

రాజధాని అమరావతి పర్యటనలో చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో దాడి చేసి అక్కడి రైతులు తగిన బుద్ధి చెప్పారని మంత్రులు కొడాలి నాని, పేర్నినాని అన్నారు. నమ్మి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని.. దీనికి రైతులు తిరగబడ్డారని అన్నారు. రైతుల భూములను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి దోచుకున్నారని ఆరోపించారు. అమరావతిని గ్రాఫిక్స్​లో చూపించి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. అమరావతిని అభివృద్ధి చేస్తానంటోన్న చంద్రబాబు అక్కడ ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని నిలదీశారు. 1 లక్ష 5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్లే ఖర్చు పెట్టారని.. దీనికి ఏటా 570 కోట్ల వడ్డీ అవుతోందన్నారు.

మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన ఘటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరో కడుపుమండి చంద్రబాబుపై రాళ్లేసి ఉంటారని వ్యాఖ్యానించారు. వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాజధానికి ఎవరైనా వెళ్లవచ్చునని.... అందులో అభ్యంతరమేమీ లేదన్నారు. రాజధానిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

ఇదీ చదవండి :

చంద్రబాబు కాన్వాయ్​పై రాజధానిలో రాళ్ల దాడి

Last Updated : Nov 29, 2019, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details