వైకాపా నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ... తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వీఎంసీ కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంపై విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు బొప్పన భవకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి తెదేపా నేతలు తీసుకువచ్చిందే అని అన్నారు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి అనుభవాలు వైకాపా నేతలూ ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో.. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని.. వీటి ప్రారంభానికి ఆహ్వానిద్దామంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నెల రోజులుగా అందుబాటులో లేరన్నారు. "అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆహ్వానం అందితే వచ్చి వెళ్లండి. కానీ.. వాళ్లు రావొద్దు, వీళ్లు రావొద్దంటే తోసివేయబడతావు"అని హెచ్చరించారు.
రావొద్దంటే తోసేయటమే: తెదేపా ఎమ్మెల్యేకు వైకాపా నేత వార్నింగ్ - ఎమ్మెల్యే గద్దెపై వైకాపా నేత భవకుమార్ వ్యాఖ్యల వార్తలు
ప్రోటోకాల్ అంశంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేయటంపై వైకాపా స్పందించింది. నెల రోజులుగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండకుండా.. ప్రోటోకాల్ అంశాన్ని రాద్దాంతం చేయటం సరికాదని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు బొప్పన భవకుమార్ అన్నారు.
ycp-leader-boppana-bavakumar-comments-on-tdp-mla-gaddea-ram-mohan