కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయ ఉద్యోగి పై వైకాపా నాయకుడు చేయి చేసుకున్నాడు. 3 నెలలుగా పింఛన్ విషయం తేల్చడం లేదంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో నోటికి వచ్చినట్లు బూతులు తిట్టాడు. వైకాపా నాయకుడి దాడి చేయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. వివాదం ముదరకుండా రంగంలోకి దిగిన ఓ ముఖ్య నాయకుడు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు. దీంతో ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడి దాడి - సచివాలయ ఉద్యోగిపై వైకాపా నేత దాడి
పింఛన్ విషయం తేల్చడం లేదంటూ ఓ వైకాపా నేత...సచివాలయ ఉద్యోగిపై దాడికి దిగాడు. నోటికి వచ్చినట్లు బూతుపురాణం మొదలుపెట్టాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగు చూసింది.
![సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడి దాడి YCP leader](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8684219-228-8684219-1599262169030.jpg)
YCP leader
ఇదీ చదవండి