స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా నేతలు తప్పుబట్టారు. ఇది కేవలం ఏకపక్ష నిర్ణయమేనని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ నిర్ణయం కరోనా వైరస్ వల్ల కాదని.. క్యాస్ట్ వైరస్ వల్ల తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైందన్న ఆయన.. ఆరు వారాల తర్వాత వైరస్ ప్రభావం తగ్గకుంటే మళ్లీ వాయిదా వేస్తారా అని ఎన్నికల కమిషనర్‌ను అంబటి ప్రశ్నించారు. రమేష్‌కుమార్ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని.. ఆయన ప్రజా నాయకుడు కాదని.. మానిప్యులేటర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాయిదా సరికాదు