సోమవారం మీడియా సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేసిన జోనికుమారి అనే మహిళ తెదేపా పెయిడ్ ఆర్టిస్ట్ అని వైకాపా అరోపించింది. జోనికుమారి వైకాపాలో లేరని ఆ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ స్పష్టం చేశారు. జోనికుమారికి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తెదేపా నేతలతో కలసి జోనికుమారి చాలా కార్యక్రమాలు చేశారని అన్నారు.
జోనికుమారి తెదేపా పెయిడ్ ఆర్టిస్ట్ : వైకాపా - వైసీపీ తాజా వార్తలు
మీడియా సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేసిన జోనికుమారి... వైకాపాలో లేరని ఆ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ స్పష్టం చేశారు. జోనికుమారి తెదేపా పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు.
జోనికుమారి తెదేపా పెయిడ్ ఆర్టిస్ట్ : వైకాపా
పెయిడ్ ఆర్టిస్టులతో తెలుగు దేశం పార్టీ నేతలు ఈ తరహా డ్రామాలు చేయిస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి చిల్లర విషయాలపై తెదేపా నేతలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. తెదేపా హయాంలో దళితుల పట్ల వివక్ష చూపుతూ అవమానించేలా మాట్లాడారని అన్నారు. రాజధాని అమరావతిలో గతకొద్ది కాలంగా చేస్తోన్న డ్రామా అందరికీ తెలుసన్న ఆమె...ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవుపలికారు.
ఇదీ చదవండి :చిత్రహింసలు పెట్టి అవమానించారు.. న్యాయం చేయండి: వరప్రసాద్