AP Local body MLC Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. 11 మంది వైకాపా అభ్యర్థులు విజయం సాధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల నుంచి.. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది.
Local body MLC Election Results: అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికైనట్టు తెలిపింది. తూర్పుగోదావరి నుంచి అనంత సత్య ఉదయ భాస్కర్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఏకగ్రీవం అయ్యారు.