శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ పంపిన దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని మండలి కార్యదర్శి వెనక్కి పంపటం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టం చేశారు. సభ్యులెవ్వరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చని వివరించారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందని తెలిపారు. పార్టీ పరంగానూ దీనిపై ఏం చేయాలని చర్చించి నిర్ణయం తీసుకుంటామని యనమల చెప్పారు.
'దస్త్రాన్ని వెనక్కి పంపటం సభా నియమాల ఉల్లంఘనే'
సెలక్ట్ కమిటీ ఏర్పాటు అంశం మరో మలుపు తిరిగింది. మండలి ఛైర్మన్ షరీఫ్ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి రెండోసారి వెనక్కిపంపారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఛైర్మన్‌కు పంపిన నోట్‌లో అసెంబ్లీ కార్యదర్శి తేల్చిచెప్పారు. ఇది సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు వివరించారు.
yanamala ramakrishna