రాజధాని మార్పుపై మాజీ మంత్రి, తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ ప్రకటన వెనుక దాదాగిరి రాజకీయాల అజెండా ఉందంటూ మండిపడ్డారు. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. తెదేపా హయాంలో విశాఖ కేంద్రంగా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతీ పెట్టుబడిని అన్ని ప్రాంతాలకు విస్తరించామని చెప్పారు. ఉత్తరాంధ్ర కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు పడిన తపనను ప్రజలు మరిచిపోరని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు భయపడుతున్నారని... గతంలో ఫ్యాక్షన్ భయంతోనే విజయమ్మను విశాఖ ప్రజలు ఓడించారని తెలిపారు.
'ప్రభుత్వ తీరుతో చూసి ఉత్తరాంధ్ర భయపడుతోంది' - yanamala reacts on capital issue
మూడు రాజధానుల ప్రకటనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని చెప్పారు.
'ప్రస్తుత పరిస్థితులు చూసి ఉత్తరాంధ్ర భయపడుతుంది'