మూడు రాజధానులు బిల్లు అంశాన్ని ప్రభుత్వం మళ్లీ సభ ముందుకు తీసుకురావాలనుకోవడాన్ని...తాము వ్యతిరేకిస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. న్యాయస్థానం, గవర్నర్ పరిధిలో ఈ అంశం ఉందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం మళ్లీ బిల్లు తేవాలనుకోవడం అసమంజసమని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు అవసరమా? - ఏపీలో మూడు రాజధానుల బిల్లు వార్తలు
న్యాయస్థానం, గవర్నర్ పరిధిలో ఉన్న మూడు రాజధానుల బిల్లుపై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్పందించారు. బిల్లును మళ్లీ సభ ముందుకు తీసుకురావాలన్న ప్రభుత్వ యోచనను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
3 రాజధానుల బిల్లుపై యనమల వ్యాఖ్యలు
వారం రోజుల పాటు శాసన మండలి నిర్వహించాలని బీఏసీలో కోరామని వివరించారు. వర్చ్యువల్ విధానంలో సభ పెట్టాలని సూచించామని...దీనికి ప్రభుత్వం అంగీకరించలేదని యనమల తెలిపారు.
ఇదీ చూడండి: వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే.. కేసుల పేరుతో వేధింపులు: ప్రత్తిపాటి