వైఎస్సార్ జలకళ జగన్ మరో మాయాజాలమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇది పాత పథకమే తప్ప కొత్తది కాదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి రైతులకు 4వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం, ఉచిత బోర్ల పేరుతో రైతులపై పంపుసెట్లు, మోటార్ల భారం మోపటం జగన్ మరో ద్రోహమని దుయ్యబట్టారు. వైఎస్సార్ జలకళ పేరుతో 2లక్షల బోర్లు వేస్తామనడం హాస్యాస్పదమన్నారు.
'వైఎస్సార్ జలకళ సీఎం జగన్ మరో మాయాజాలం' - జలకళపై యనమల రామకృష్ణుడు
వైఎస్సార్ జలకళ పేరుతో 2లక్షల బోర్లు వేస్తామనడం హాస్యాస్పదమని శాసన మండలి ప్రతిపక్ష నేతయనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఇది పాత పథకమే తప్ప కొత్తది కాదన్నారు.
yanamala ramakrishnudu on ysr jala kala
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపర్చే బాధ్యత తెదేపా నాయకులు, కార్యకర్తలదేనన్నారు. పార్లమెంటు కమిటీలకు నూతనంగా ఎన్నికైన తెదేపా నాయకులకు యనమల శుభాకాంక్షలు తెలిపారు. కమిటీలలో బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబుకు యనమల రామకృష్ణుడు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: రైతులకు ఉచితంగా బోర్లు..ఖర్చంతా ప్రభుత్వానిదే: సీఎం