ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు..?: యనమల - latest news on carona

ఏపీ ప్రభుత్వం కరోనా నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టిందని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనాపై భయభ్రాంతులకు గురవుతుంటే... సీఎం జగన్​ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

yanamala ramakrishnudu on carona
సీఎం జగన్​పై యనమల వ్యాఖ్యలు

By

Published : Mar 19, 2020, 1:21 PM IST

సీఎం జగన్​పై యనమల వ్యాఖ్యలు

సీఎం జగన్​ ఎస్‌ఈసీపై అనవసర ఆరోపణలు చేశారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయగానే కంగారుపడి.. ఎస్‌ఈసీపై అక్కసు వెళ్లగక్కారని ఆక్షేపించారు. సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా చుక్కెదురైందని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా కరోనాపై భయభ్రాంతులకు గురవుతున్నారని.. కరోనా వ్యాప్తి నివారణపై సీఎం జగన్‌ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని యనమల ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై ప్రపంచ నేతలే ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తున్నారని... ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details