ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు: యనమల - Yanamala Ramakrishnudu Latest News

కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం.. సమయమంతా కక్షసాధింపులకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.

యనమల
యనమల

By

Published : May 9, 2021, 11:38 AM IST

కరోనాను కట్టడి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ ముప్పు ఉందని తెలిసీ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సమయమంతా కక్షసాధింపులకే కేటాయిస్తున్నారన్న యనమల... ఎన్440కే వైరస్ గురించి చంద్రబాబు అప్రమత్తం చేయడం తప్పా..? అని నిలదీశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details