సీఎం జగన్ తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని తెదేపా నేత యనమల దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు కొరవడినందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే రాష్ట్ర బడ్జెట్ సైతం అభివృద్ధి రహితంగానే ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు వాయిదాల్లో నిమగ్నమై.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో నిర్లక్ష్యం చేశారన్న యనమల... తాజా బడ్జెట్‌పై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి చెప్పడం సహా, 15వ ఆర్థిక సంఘాన్ని ఒప్పించడంలోనూ విఫలమయ్యారన్నారు. పీపీఏల రద్దుతో కేంద్రం సహకరించని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వైకాపా 8 నెలల పాలనలో అప్పులు మాత్రం విపరీతంగా పెంచేశారన్నారు. ఆర్థికమంత్రి బుగ్గన ఎంతసేపూ పాత చరిత్ర తవ్వడంలోనే కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చేశారన్న ప్రశ్నలోనే తెలంగాణపై వైకాపా ప్రేమ తెలుస్తోందని ఎద్దేవా చేశారు.
కేంద్ర నిధులు రాకపోవటడానికి.. సీఎందే బాధ్యత: యనమల - తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణ వార్తలు
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయింపులు కొరవడినందుకు సీఎం బాధ్యత వహించాలన్నారు. తాజా బడ్జెట్‌పై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
yanamala ramakrishna comments on budget