ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సంపద పెరగకపోతే... పెట్టుబడులు ఎలా వస్తాయి' - yanamala rama krishnudu fires on ysrcp government

సంపద పెరగకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తరలింపు పేరుతో తెచ్చిన సమస్యలతో కొత్త సంస్థలు వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఏడు నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు.

yanamala rama krishnudu on ysrcp government
వైకాపా ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు

By

Published : Jan 2, 2020, 1:32 PM IST

ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు విమర్శలు

రాష్ట్ర సంపద పెరగకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో సంపద సృష్టికి ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుత సర్కారు దాన్ని దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. అశాంతిని రాజేసేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

పక్కరాష్ట్రాలకు ఆదాయం

తరలింపు పేరుతో తెచ్చిన సమస్యలతో కొత్త సంస్థలు వచ్చే పరిస్థితి లేదని యనమల మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు ఆదాయం చేకూర్చేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని... నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారుని యనమల ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

16వ రోజూ కొనసాగనున్న రాజధాని రైతన్నల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details