'నియంతల లక్షణాలన్నీ సీఎంకు ఉన్నాయి' - జగన్‌పై యనమల రామకృష్ణుడు వ్యాఖ్య
నియంతలకు ఉండే అన్ని లక్షణాలు సీఎం జగన్‌లో ఉన్నాయని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్, హిట్లర్, ముస్సోలి, నీరో కలిస్తే ఎలా ఉంటారో.. జగన్ అలా ఉన్నారని ఆక్షేపించారు. రాష్ట్రం నాశనం అవుతున్నా ముఖ్యమంత్రి తనకు ఏమీ పట్టనట్లు ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రం తగలబడుతుంటే జగన్ ఇంట్లో కూర్చుని ఆనందిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 48 శాతం రెవెన్యూ పడిపోయిందని దుయ్యబట్టారు. అడ్వైజర్లపై ఎందుకు అనవసర ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. సలహాదారులు మంచి చెప్పినా జగన్ వినే పరిస్థితి లేదని యనమల ఆరోపించారు.
సీఎం జగన్‌పై యనమల ఆగ్రహం