రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై వైకాపా ప్రభుత్వ పాలన దుష్ప్రభావాన్ని చూపిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. భవిష్యత్తులో కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. కొవిడ్ నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా రెండో దశతో ఏపీలో తిరోగమన వృద్ది ఖాయమని యనమల అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే సీఎం ఘనత అని ఎద్దేవా చేశారు. 2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడు లెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టేది కాదని స్పష్టంచేశారు. ఈ ఆర్ధిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో 3ఏళ్లు రాష్ట్రం అతలాకుతలం అవుతుందన్నారు.