ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా? ' - మూడు రాజధానులపై యనమల

రీజనల్ డెవలప్​మెంట్ అథారిటీలను మరిన్ని ఏర్పాటు చేయడంలో పోటీబడాలే తప్ప... ఉన్న సీఆర్డీఏ రద్దు చేయడం అభివృద్ది కాదని తెదేపా నేత యనమల అభిప్రాయపడ్డారు. వైకాపా పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

yanamala on three capitals
మూడు రాజధానులపై యనమల

By

Published : Aug 2, 2020, 12:49 PM IST

అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా? అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. మూడు ప్రాంతాలను ఫ్యాక్షనిస్టుల హస్తగతం చేయడమే వైకాపా అభివృద్ధి అని దుయ్యబట్టారు. స్థానికుల ఆస్తిపాస్తులన్నీ దోచి భూ కబ్జాదారులకు కట్టబెట్టడమే వైకాపా చేసేదని ఆరోపించారు.

రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేయడంలో పోటీపడాలే తప్ప.... ఉన్న సీఆర్డీఏ లను రద్దు చేయడం కాదని అభిప్రాయపడ్డారు. సొంత బాధ్యతలే తప్ప సామాజిక బాధ్యత లేని సీఎంగా చరిత్రలో జగన్మోహన్‌రెడ్డి మిగిలిపోతారని ఆరోపించారు.

ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details