పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపటాన్ని తెదేపా ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే 2014 పునర్విభజన చట్టం సవరణ తప్పనిసరని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే ఉంది కానీ రాజధానులు ఏర్పాటు చేసుకోమని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు విభజన చట్టంలోని అంశాలను పరిగణంలోకి తీసుకోవాలని యనమల సూచించారు.
'విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి' - news on crda bill
రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ ద్వారానే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమని తెలుగుదేశం స్పష్టం చేసింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై నిర్ణయం తీసుకునే ముందు గవర్నర్ న్యాయ సలహా కోరటం లేదా రాష్ట్రపతికి పంపటం చేయాలని తెదేపా ఎమ్మెల్సీలు కోరారు. శాసనమండలిలో రెండోసారి టేబుల్ కూడా కాని బిల్లులు.. సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉండగా.. రూల్ 197 వాటికి ఎలా వర్తిస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై యనమల
రాజధానిపై ప్రజాభిప్రాయం తీసుకోవటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని యనమల నిలదీశారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమన్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికలను పరిగణంలోకి తీసుకొని అమరావతిని రాజధానిగా నిర్ణయించారని యనమల గుర్తుచేశారు.
ఇదీ చదవండి: కరోనా తీవ్రతకు, బ్లడ్ గ్రూప్స్నకు సంబంధం ఉందా?