రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పడకేసిందని, నిరుద్యోగం పెరిగిపోతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైకాపా పేరు చెబితే పారిశ్రామికవేత్తలు పరారవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15శాతం ఉందన్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్, లేటరైట్, బాక్సైట్, లైమ్ స్టోన్, బెరైటీస్ పై ‘‘జె గ్యాంగ్’’ నిలువుదోపిడీతో ఖజానాకు చిల్లుపెడుతున్నారని యనమల మండిపడ్డారు. పేదల స్కీముల్లోనూ స్కాములకు పాల్పడి వైకాపా నేతలు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. తద్వారా పబ్లిక్ రంగంలో పెట్టుబడులకు ఎటువంటి ఆదాయాలు లేకుండా పోయాయని తెలిపారు.
వైకాపా పేరు చెబితే పారిశ్రామిక వేత్తలు పరార్: యనమల - వైకాపాపై యనమల విమర్శలు
వైకాపా పేరు చెబితేనే పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జే గ్యాంగ్ నిలువుదోపిడీతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పడుతోందని విమర్శించారు.
2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు రాష్ట్రంలో ఎఫ్‌డీఐలు 638.72 కోట్ల రూపాయలు మాత్రమేనన్న యనమల... జాతీయ స్థాయిలో 1శాతం కూడా లేకపోవడం జగన్ ప్రభుత్వ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యంగా పేర్కొన్నారు. దేశంలో ఏపీ 15వ స్థానానికి దిగజారిందని విమర్శించారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమలు, ఉద్యోగాలు లేవన్నారు. తెదేపా ప్రభుత్వం 3 పారిశ్రామిక సదస్సులలో ఆకర్షించిన 16లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 30లక్షల మంది యువతకు ఉద్యోగాల ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారని దుయ్యబట్టారు. అనంతపురంలో కియాకు వైకాపా ఎంపీ బెదిరింపులు, కడపలో సోలార్ ప్యానళ్ల ధ్వంసం, గుంటూరులో సిమెంట్ ఫ్యాక్టరీలకు వేధింపులు, చివరికి రోడ్డు పనుల కాంట్రాక్టర్లను కూడా వదలిపెట్టడం లేదని ఆక్షేపించారు. సెజ్‌లు, పోర్టులు, ప్రభుత్వ ప్రైవేటు భూములన్నీ జగన్ బినామీల పరంగా మారాయని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
ఇదీ చదవండి:RE ISSUE: ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయం