కరోనాపై ఏ మాత్రం బాధ్యత లేకుండా సీఎం మాట్లాడారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కరోనాకు ప్రపంచమంతా వణుకుతుంటే జ్వరం లాంటిదని ఎలా అంటారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం పట్ల సీఎంకు ఎంత శ్రద్ద ఉందో దీనితోనే తెలుస్తుందన్నారు. భవిష్యత్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ మాత్రం శ్రద్ద పెట్టకుండా.. మొక్కుబడిగా ఉన్నారని ఆరోపించారు. నివారణ చర్యలు చెప్పకపోగా.. నిపుణుల సలహాలు తీసుకుపోవడాన్ని యనమల తప్పుబట్టారు.
'ప్రపంచం వణుకుతుంటే.. జ్వరం లాంటిదంటారా?' - corona effect in andhra pradesh
కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే జ్వరంలాంటిదని సీఎం జగన్ ఎలా అంటారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. సీఎం జగన్ వైరస్ నివారణపై మొక్కుబడిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్పై యనమల రామకృష్ణుడు ఆగ్రహం