రాజ్యాంగానికి వైకాపా నేతలు కొత్త భాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్స్, క్లాజ్‌ల గురించి తమకిష్టం వచ్చిన భాష్యం చెప్పడానికి ఇది వైకాపా మేనిఫెస్టో కాదని ఎద్దేవా చేశారు. సాధారణ బిల్లులకు 14 రోజుల నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. హైకోర్టులోనూ అవి మనీ బిల్లులు కావని ఏజీ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మరి నాన్ మనీ బిల్లులకు 14రోజుల నిబంధన ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘ఎన్ని అడ్డదారులైనా తొక్కుదాం, పంతం నెరవేర్చుకుందాం' అన్న మూర్ఖత్వమే వైకాపా నేతల మాటల్లో కనిపిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి వైకాపా పంతం నెరవేర్చుకోవాలని చూడటం హేయమని విమర్శించారు. ఒకసారి ఛైర్ పర్సన్ తన నిర్ణయాన్ని ప్రకటించాక... దానిని ప్రశ్నించే అధికారంగాని, మార్చే అధికారంగాని సభ్యులకే కాదు, అధికారులకూ ఉండదని యనమల ట్వీట్ చేశారు.
రాజ్యాంగానికి వైకాపా నేతలు కొత్త భాష్యం చెప్పారు: యనమల - Ap legislative council news
అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై వైకాపా - తెదేపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ బిల్లులను 14 రోజులు గడచినా సెలెక్టు కమిటీకి పంపనందున ఆమోదం పొందినట్లేనని మంత్రులు అంటున్నారు. అయితే నాన్ మనీ బిల్లులకు ఈ నిబంధన ఎలా వర్తిస్తుందని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు.
yanamala
Last Updated : Feb 12, 2020, 10:42 PM IST