yanamala: కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ఆర్థికస్థితిని చక్కదిద్దే దిశగా కార్యాచరణను ముఖ్యమంత్రి చేపట్టకపోవడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండున్నరేళ్ల పాలన దుష్ఫలితాలపై కనీసం సమీక్షించలేదని తప్పుబట్టారు. కొత్త ఏడాదిలోనూ ఇవే వైఫల్యాలు ఎదురైతే ఈ రాష్ట్రాన్ని బాగుచేయడం ఎవరివల్ల కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూలోటు 918 శాతం ఎగబాకితే.. ద్రవ్యలోటు 388 శాతానికి పెరిగిపోయిందన్నారు. ప్రత్యేక హోదాపై కనీసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదని అన్నారు. పోలవరం, అమరావతి పనులన్నీ పూర్తిగా నిలిపివేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
yanamala: కొత్త సంవత్సరంలోనైనా రాష్ట్రం ప్రగతిబాట పట్టాలి: యనమల - ap news
yanamala: కొత్త సంవత్సరంలోనైనా రాష్ట్రం ప్రగతిబాట పట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలోనైనా కార్యాచరణ ప్రణాళిక దిశగా కసరత్తు లేదని విమర్శించారు.
![yanamala: కొత్త సంవత్సరంలోనైనా రాష్ట్రం ప్రగతిబాట పట్టాలి: యనమల yanamala comments on ysrcp government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14057306-101-14057306-1640937136958.jpg)
yanamala comments on ysrcp government