ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తాం' - yanamala fire on sakshi media news

ఐటీ సోదాలపై సాక్షి మీడియా అవాస్తవాలు ప్రచారం చేసిందని.. వాటిపై ప్రెస్ ​కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తామని తెదేపా నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల చెప్పారు. తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా ఆ మీడియా దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. పరువు నష్టం దావా వేసేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

yanamala-comments-on-sakshi-media
yanamala-comments-on-sakshi-media

By

Published : Feb 17, 2020, 2:49 PM IST

'సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేస్తాం'

ఐటీ దాడులపై సాక్షి మీడియా అవాస్తవాలు ప్రచారం చేసిందని మండలి ప్రతిపక్ష నేత యనమల అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు బహిర్గతమయ్యాయని వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛ ఉందిగా అని ఇష్టానుసారం రాయటానికి వీల్లేదని హితవు పలికారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు ఎడిటర్స్ గిల్డ్​కి కూడా త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు పరువునష్టం దావా కూడా వేసేందుకు తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు పరువు నష్టం దావాలు వేసినా... సాక్షి మీడియా తీరు మార్చుకోవడం లేదని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details