మాజీ ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిస్సందేహంగా రాజ్యాంగ ఉల్లంఘనేనని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. చేశారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ గర్హించాలన్నారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం సీజ్ అంటే మధ్యలో నిలిపేయడం అనే అర్ధం వస్తుందని, దీని బట్టే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవీకాలం ఏ విధంగా సీజ్ చేశారో, డిస్కంటిన్యూ చేశారో.. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ బట్టి తెలుస్తోందన్నారు. ఒకసారి ఎన్నికల కమిషనర్ నియామకం తర్వాత, ఆయనకు ప్రతికూలంగా పదవీకాలంలో మార్పు ఉండదని.... రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కె స్పష్టంగా పేర్కొందన్నారు.
ఎస్ఈసీ పదవీ కాలం కుదింపు రాజ్యాంగ ఉల్లంఘనే: యనమల - తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
ఆర్డినెన్స్-2 రాజ్యాంగ ఉల్లంఘనేనని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ గర్హించాలన్నారు.
yanamala
లక్నో హైకోర్టు తీర్పు రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు వర్తించదన్నారు. ఇప్పుడున్న కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో, రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా ఎస్ఈసీ పదవీ కాలం కుదింపు అత్యవసర నిర్ణయం కాదన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చి చెప్పారు. ఒక వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తే, ఆ దుందుడుకు చర్యలను మరో వ్యవస్థ అడ్డుకోవాలనే సదుద్దేశంతోనే.. మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఫోర్త్ ఎస్టేట్స్‌గా రూపొందించారన్నారు.