ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నూతన పారిశ్రామిక విధానంతో ఒరిగేదేమీ లేదు'

By

Published : Aug 11, 2020, 12:00 PM IST

ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ విధానంతో ఉపాధి కల్పనకు, భవిష్యత్ తరాలకు ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇలాంటి పాలసీ కోసం 14నెలల విలువైన సమయాన్ని వృథా చేసిందని ఎద్దేవా చేశారు.

yanamala comments
yanamala comments

రాష్ట్ర ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానంతో ఒరిగేదేమీ లేదని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఉపాధి కల్పనకు ఏమాత్రం ఉపయోగపడని ఈ విధానం కోసం... 14 నెలల సమయాన్ని వృథా చేశారని అన్నారు. క్రెడిట్ రేటింగ్ పడిపోయిందని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని గుర్తుచేశారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైకాపా నాయకులు నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకంతో పారిశ్రామిక వృద్ధి శాతం మైనస్ 2.2కు పడిపోయిందని... తయారీ, నిర్మాణ రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని ఆవేదన చెందారు. బలహీన వర్గాలవారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. గత 14 నెలల్లో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే అందుతున్నాయని విమర్శలు గుప్పించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను దెబ్బతీసే విధంగా.. నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. సబ్సీడీలు, విద్యుత్‌ రాయితీలు అన్నీ కుదించారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:మౌలిక సదుపాయాల నిధితో రైతు కష్టాలు తీరేనా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details