ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. 2020 ఆర్డినెన్స్ 2 ఒక నల్ల చట్టమన్న యనమల.. ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలే జగన్ చీకటి పాలనకు నిదర్శనాలన్నారు. ఏదో వంకచూపి గెలిచిన అభ్యర్ధులపై కక్ష సాధించడానికే ఈ సవరణ చేశారని యనమల ఆరోపించారు. పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్ధులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ చెల్లదన్న ఆయన....తెలుగుదేశం పార్టీ దీనిపై న్యాయస్థానంలో సవాల్ చేస్తుందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని స్పష్టంచేశారు. 8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఏ విధంగా వాయిదా వేస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షాలను బెదిరించేందుకే చీకటి చట్టాలు తెచ్చారు: యనమల - తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వార్తలు
జగన్ పాలనలో అన్నీ నల్ల చట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలే నని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ అనేది ఈసీ పరిధిలోని అంశమన్న ఆయన..66 మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో గతంలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు.
yanamala