కరోనాను మించిన జగోనా వైరస్ విధ్వంసాల వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. అక్రమాలు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే చాలదని.. వాళ్లను ప్రోత్సహించిన ఉన్నతాధికారులనూ తప్పించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం పట్ల అనుచిత ప్రవర్తనపై కోర్టులో డీజీపీ క్షమాపణ చెప్పడం.. ఇదే తొలిసారని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో జరిగినవి స్వచ్ఛంద ఏకగ్రీవాలు కావని, బలవంతపు, నిర్బంధ ఏకగ్రీవాలని ఆరోపించారు. ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని యనమల కోరారు.
స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలన్ని రద్దు చేయాలి: యనమల - జగన్‌పై యనమల రామకృష్ణుడు కామెంట్స్
స్థానిక ఎన్నికల వాయిదాను శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. డీజీపీ సవాంగ్‌ను తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యానికి డీజీపీయే కారణమని ఆరోపించారు.
![స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలన్ని రద్దు చేయాలి: యనమల yanamala comments on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6417664-1048-6417664-1584285829939.jpg)
yanamala comments on jagan