మండలిలో తెదేపా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని మేం ముందుగానే నోటీసులిచ్చామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకేరోజు బిల్లు పెట్టి..చర్చ జరిపి..ఓటింగ్ చేసేసుకున్నా వైకాపా నుంచి రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. మండలిలో మెజార్టీ ఉన్న తాము అడిగితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని..కావాలంటే ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఛైర్మన్‌కు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయని అన్నారు. మెజార్టీ సభ్యులు ఏం కోరుకుంటే ఛైర్మన్ అదే చేస్తారని వ్యాఖ్యానించారు.
'సెలెక్ట్ కమిటీకి పంపాలని ముందుగానే నోటిసులిచ్చాం'
మండలిలో మెజార్టీ ఉన్న తాము అడిగితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన పలు అంశాలను వెల్లడించారు.
yanamala-comments-on-govt-over-decentralization-bill
ఇదీ చదవండి : 'నన్ను గ్యాలరీ నుంచి వెళ్లమనడానికి మీరెవరు?'