ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నాం: యనమల - Ayyanna comments on CID case

సీఐడీ నోటీసులపై హైకోర్టు స్టే ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వడంలో సీఐడీ విఫలమైందని ఆరోపించారు. రాజధానిపై గత ప్రభుత్వ ఉత్తర్వులు తప్పెలా అవుతాయని ప్రశ్నించారు.

Yanamala comments on CID Case
సీఐడీ నోటీసులపై హైకోర్టు స్టే

By

Published : Mar 19, 2021, 8:36 PM IST

రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వటాన్ని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. సరైన సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచటంలో సీఐడీ విఫలమవటంతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పుడు కేసు పెట్టారనేది తేలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఎస్సీ, ఎస్టీలను బలవంతపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం సీఐడీ చేస్తున్నట్లుగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర రాజధాని ప్రయోజనాల కోసం నాటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తప్పెలా అవుతాయని యనమల నిలదీశారు.

తప్పుడు కేసు కాబట్టే కోర్టు స్టే ఇచ్చింది: అయ్యన్న

తప్పుడు కేసు అని నమ్మితేనే న్యాయస్థానం స్టే ఇస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. చంద్రబాబుపై అలా పెట్టిన ప్రతీ కేసులో స్టే ఇచ్చిన కోర్టులు.. జగన్​వి తప్పుడు కేసులు కాదు కాబట్టే స్టే నిరాకరించాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన ప్రతి తప్పుడు కేసు న్యాయస్థానం కొట్టేయటం.. లేదా చంద్రబాబు అవినీతి చేశారని రుజువు చేయటం తన వల్ల కాదని.. వైఎస్ఆర్, విజయమ్మ ఉపసంహరించుకున్న సందర్భాలున్నాయని గుర్తుచేశారు. ఇంతలా స్టేలు గురించి ఆయాసపడుతున్న బులుగు బ్యాచ్, మీ అవినీతి ఏ1 సామ్రాట్, ఎన్ని సార్లు స్టే కోసం ప్రయత్నం చేసారో చూడాలని.. దొంగ అడ్డంగా దొరికాడు కాబట్టే స్టే ఇవ్వలేదని వివరించారు. అవినీతి కేసుల్లో తీర్పులు ఇచ్చే సమయంలో.. జగన్ రెడ్డిని ఉదాహరిస్తూ తీర్పులు కూడా ఇస్తున్నారని వివిధ సందర్భాల్లో జగన్ స్టే కోసం ప్రయత్నించిన ఘటనలను అయ్యన్న ట్విట్టర్​లో పేర్కొన్నారు.

న్యాయం మావైపే ఉంది: కొల్లు

అమరావతి రాజధానికి ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని రైతులు చెప్తుంటే.. ప్రభుత్వం దురుద్ధేశంతో చంద్రబాబు, నారాయణలకు నోటీసులిచ్చిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అమరావతిపై వైకాపా మొదటి నుంచి విషం కక్కుతూనే ఉందన్నారు. రాజధానిని అల్లరి చేసేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అన్ని పారదర్శకంగా చేశారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో న్యాయం మావైపే ఉందని అర్థమవుతోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించటం తగదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు ఎంతో ప్రమాదకరమని మండిపడ్డారు.

ఇదీ చదవండి:'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'

ABOUT THE AUTHOR

...view details