శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్ కమిటీని ప్రభుత్వం ఉద్దేశ్వపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు ఇక్కడ రుజువవుతోందని వెల్లడించారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించడం, లేదా ధిక్కరించే అధికారం అధికారులతో సహా ఎవ్వరికీ లేదని యనమల తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు.
అలా చేయడం సభాహక్కుల ఉల్లంఘనే: యనమల - three capitals for ap news
సెలక్ట్ కమిటీ ఏర్పాటును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
![అలా చేయడం సభాహక్కుల ఉల్లంఘనే: యనమల Yanamala comments on Assembly Secretary over formation of select committe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6043730-277-6043730-1581486944959.jpg)
Yanamala comments on Assembly Secretary over formation of select committe
TAGGED:
three capitals for ap news