'వైకాపా రాక్షసత్వానికి సమానమైన పదం డిక్షనరీలోనూ లేదు' - స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలపై యనమల ఆగ్రహం
వైకాపా రాక్షసత్వానికి సమానపదం డిక్షనరీలో కూడా లేదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ప్రతి చోటా ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలన్న ఆయన.. కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్నారు. తెదేపా నేతల ఇళ్లల్లో పోలీసులే మద్యం సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసిందన్నారు.
యనమల రామకృష్ణుడు