తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయానికి కార్తిక మాసం ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్రతాలు, దీపారాధనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఆదివారం(13న) భక్తుల నుంచి రాబడి పెరిగింది. వివిధ విభాగాల ద్వారా వ్రతాలు, శీఘ్ర దర్శనం, కళ్యాణకట్ట, ప్రసాద విక్రయాలు, తదితర పూజలతో ఆలయానికి చేకూరిన ఆదాయం రికార్డు స్థాయిలో రూ.40,84,610లకు చేరింది.