ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలోనే యాదాద్రి ఆలయానికి అష్టదిక్పాలకుల విగ్రహాలు: యాడా - yada news

తెలంగాణలోని యాదాద్రి ప్రధాన ఆలయం వద్ద, బయటివైపు శాలహారాలలో వివిధ రకాల దేవతామూర్తులు విగ్రహాలను పొందుపరుస్తున్నట్లు యాడా అధికారులు తెలిపారు. త్వరలోనే ఆలయానికి అష్టదిక్పాలకుల విగ్రహాలు ఆలయానికి రానున్నట్లు వెల్లడించారు.

yadadri temple
యాదాద్రి ఆలయం

By

Published : Apr 23, 2021, 1:32 PM IST

తెలంగాణలోని యాదాద్రి పుణ్య క్షేత్రంలో అష్టదిక్పాలకుల విగ్రహాలను ప్రతిష్టించేందుకు యాడ చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆలయానికి విగ్రహాలు రానున్నాయని అధికారులు తెలిపారు. అన్ని విగ్రహాలు వచ్చాక ధ్వజస్తంభాన్ని అనుసంధానం చేసుకొని ప్రధానాలయంలోని గర్భాలయం చుట్టూ ప్రతిష్టిస్తామని వెల్లడించారు. ప్రధాన ఆలయం వద్ద, బయటి వైపు శాలహారాలలో వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరిచే పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

దేవస్థానాన్ని అత్యంత అద్బుతంగా తీర్చిదిద్దేందుకు యాడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే కృష్ణ శిలతో ఆలయంలో విష్ణుమూర్తి అవతారాలు, నరసింహుని రూపాలు, దశావతార, వివిధ దేవాతామూర్తుల రాతి విగ్రహాలు పొందుపరిచింది.

ABOUT THE AUTHOR

...view details