ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత - యాదాద్రిలో ఆర్జిత సేవలు నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఆలయంలో పలువురు ఉద్యోగులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు.

laxmi Narasimhaswamy Temple closed for three days
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

By

Published : Mar 27, 2021, 5:56 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విద్యాలయాలు మూతపడ్డాయి. ఆ జాబితాలో ఆలయాలు చేరాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో పలువురు ఉద్యోగులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. ఆదివారం కావడం భక్తుల రద్ధీ పెరిగే అవకాశం ఉన్నందున భక్తులు పాల్గొనే ఆర్జిత సేవలు రేపటి నుంచి మూడు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

వసంతమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా పండుగలు రానున్నాయి. వచ్చేనెలలో జరగాల్సిన భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవంపై సందిగ్ధత నెలకొంది. పలు ఆలయాల్లో ఉద్యోగులు, అర్చకులు వైరస్​ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుచేయమని స్పష్టం చేసిన సర్కారు కొవిడ్​ నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించడం, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details