ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యాదాద్రికి భారీగా హుండీ ఆదాయం

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 19 రోజులుగా భక్తులు హుండీలో వేసిన నగదు, ఇతర కానుకల రూపంలో రూ. కోటికి పైగా ఆదాయం.. స్వామివారి ఖజానాకు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

By

Published : Feb 24, 2021, 7:13 AM IST

Published : Feb 24, 2021, 7:13 AM IST

yadadri
యాదాద్రికి భారీ హుండీ ఆదాయం

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. 19 రోజులకు.. రూ. 95లక్షల, 24వేల, 587 నగదుతో పాటు.. 185 గ్రాముల బంగారం, 2, 600 గ్రాముల వెండి.. ఆలయ ఖజానాకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.

మరోవైపు గుట్టపై.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు భీష్మ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details