ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు - lockdown

లాక్​డౌన్​ నేపథ్యంలో తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను భక్తులు లేకుండా నిర్వహిస్తున్నారు. రెండోరోజైన నేడు స్వామి వారికి మంగళ నీరాజనం, మంత్రపుష్పములతో పూజలు, లక్షకుంకుమార్చన నిర్వహించారు.

yadadri-jayanthi-utsavalu-in-yadadri-bhuvangiri-district
శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

By

Published : May 5, 2020, 6:02 PM IST

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి. వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నరసింహుడి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి జరుగుతున్న జయంతి ఉత్సవాలను లాక్​డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండా నిర్వహిస్తున్నారు.

జయంతి ఉత్సవాల్లో రెండోరోజైన ఇవాళ కాళీయమర్ధన అలంకారంలో బాలాలయంలో స్వామివారు ఊరేగారు. స్వామివారికి మంగళ నీరాజనం, మంత్రపుష్పములతో ప్రత్యేక పూజలతో పాటు లక్షకుంకుమార్చన నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన రేపు సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు.

ఇవీ చూడండి

చిన్నారులను మింగేసిన చెరువు!

ABOUT THE AUTHOR

...view details