ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధతను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్. వరలక్ష్మి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
స్థానికులకు 75శాతం రిజర్వేషన్లపై పిటిషన్
12:12 May 06
హైకోర్టులో రిట్
ఈ అంశంపై సర్కారు తరఫున ప్రభుత్వ న్యాయవాది సుమంత్ రెడ్డి స్పందిస్తూ పారిశ్రామికవేత్తలు ఎవరైనా దీనిపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది తప్ప న్యాయవాదులు, ఇతరులకు అవకాశంలేదని వాదనలు వినిపించారు. ఈ అంశంలో ప్రజాప్రయోజనం కూడా ఇమిడి ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే ఈ నిర్ణయం తీసుకుందా? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి : కలెక్టర్ పీఏనని చెప్పాడు.. డబ్బులు మాయం చేశాడు!