ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం - బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం

ప్రపంచ క్యాన్సర్​డే పురస్కరించుకుని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నర్సింగ్ విద్యార్థులు ప్రత్యేకంగా క్యాన్సర్ అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు.

cancer awareness exhibition in Basavatarakam Hospital
బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటైన క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం

By

Published : Feb 5, 2020, 1:30 PM IST

బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటైన క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం

ప్రపంచ క్యాన్సర్​డే సందర్భంగా తెలంగాణలోని బసవతారకం ఇండో అమెరికన్​ ఆస్పత్రిలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి సీఈవో ప్రభాకర్​ ప్రారంభించారు. క్యాన్సర్​ రకాలు, కారణాలు.. నివారణ మార్గాలపై నర్సింగ్​ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ ప్రదర్శన ఈనెల ఆరో తేదీ వరకు ఉంటుందని... ఎవరైనా తిలకించవచ్చని వైద్యులు తెలిపారు. కాన్సర్​ని తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని డాక్టర్​ ప్రభాకర్​ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చూడండి: పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్​లో ముగ్గురికి​!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details