Autism Awareness Day: ప్రతి తల్లి, తండ్రి ఉల్లాసంగా ఆడుకునే ఆరోగ్యకరమైన సంతానాన్ని ఊహించుకుంటారు. కానీ ఎవరైనా చిన్న వయసులో అసాధారణంగా, మందబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటే వారి నానమ్మలు, అమ్మమ్మలు ఇటువంటి పిల్లలను మన వంశంలో ఎప్పుడూ చూడలేదు అని దిగులు పడుతుంటారు. ఇటువంటి పిల్లలనే ఆటిజం ఉన్న పిల్లలుగా గుర్తించవచ్చు. దీనిని ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ అని కూడా అంటారు. సాధారణ శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో కళ్లు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. భారత్లో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు
ఆటిజంను గుర్తించడమెలా?
ఏదైనా వస్తువు పెద్ద శబ్దంతో కిందపడేస్తే అటువైపు చూస్తారు. కానీ పేరు పెట్టి పిలిస్తే మాత్రం పలకరు. అమ్మ ఎక్కడుందని అడిగితే చూపించరు. ఇతర పిల్లలతో ఆడుకోరు. కొందరు ఒక చోట కుదురుగా కూర్చోరు. అక్షరాలను రాయడానికి కూడా ఏళ్లు పడుతుంటుంది. 7-8 ఏళ్లు దాటినా కూడా పక్క తడిపేస్తుంటారు. వీరిలో కొందరికి నిద్ర కూడా సరిగా పట్టదు.
ఎందుకు వస్తుంది?
* 15-20 శాతం జన్యుపరమైన లోపాలతో
* మిగిలిన 80-85 శాతం సరైన కారణాలను కనుగొనలేదు.